calender_icon.png 22 November, 2024 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నివర్గాలకు రిజర్వేషన్ ఫలాలు

22-11-2024 01:16:18 AM

  1. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  2. రంగారెడ్డి కలెక్టరేట్‌లో బీసీ కులసంఘాలతో సమావేశం

రంగారెడ్డి, నవంబర్21 (విజయక్రాంతి): జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని.. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మ న్ గోపిశెట్టి నిరంజన్ పేర్కొన్నారు.

గురువారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాకు చెందిన బీసీ కులసంఘాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించా రు. జిల్లా పరిధిలో సామాజికంగా, ఆర్థికం గా, విద్య, ఉద్యోగాల పరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులు, వారి సమస్యలపై బహిరంగ విచారణ చేపట్టారు.

ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 7 బహిరంగ విచారణ పూర్తిచేయగా.. ఇది 8వ బహిరంగ విచారణ అన్నారు. ఈనెల 26 వరకు జిల్లాల్లో బహిరంగ విచారణ కొనసాగుతుందని చెప్పారు. 

ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి..

ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు అందని సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్లు క ల్పించాలని కొందరు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. వారిపై బీసీ ఉన్నతవర్గాలు వివ క్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విచారణకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు గైర్హాజర్ కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాపోలు జయ ప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, లింగ్యానాయక్, విజేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ సంగీత,  అధికారులు పాల్గొన్నారు.