calender_icon.png 12 October, 2024 | 7:55 AM

ఉల్లిపొట్టుతో లాభాలు!

01-10-2024 12:00:00 AM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఉల్లిపాయలను కట్ చేసిన తర్వాత ఉల్లి పొట్టును పడేస్తారు. కానీ ఉల్లి పొట్టుతో ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. వీటిల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఉల్లిపొట్టుతో చర్మం, జుట్టు సమస్యలతో పాటు కంటి చూపును కూడా మెరుగు పరచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నారు. దీంట్లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం..

* ఉల్లిపాయ పొట్టులో విటమిన్లు ఇ,సి,ఎ, పొటాషియం, క్యాల్షియం, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

* ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఉల్లిపొట్టును శుభ్రం చేసి నీటిలో వేసి ఓ పది నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని చల్లారిన తర్వాత తాగాలి. అందులో ఉండే క్వెర్సెటివ్ అనే యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

* ఉల్లిపాయ పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లి పొట్టు మరిగించిన నీటిని తాగితే.. జీర్ణక్రియ కూడా మెరుగ్గా పని చేస్తుంది. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

* ఉల్లిపాయ పొట్టును మరిగించిన నీటిని తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 

* ఉల్లి పొట్టును మరిగించిన నీటిని తాగినా లేక జుట్టుకు అప్లు చేసినా.. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.