calender_icon.png 16 March, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాఫింగ్ యోగా లాభాలు!

16-03-2025 12:09:23 AM

హెల్త్ 

ఎలాంటి అనారోగ్యాన్నైనా, మానసిక సమస్యలైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదు. అందుకే చాలామంది తాము చేసే రోజువారీ వ్యాయామాల్లో భాగంగా యోగాను చేర్చుకుంటారు. ఈ యోగా ఫన్ మాత్రమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందంటున్నారు నిపుణులు.. 

* ఈ యోగా పద్ధతి అన్ని శరీర అవయవాలకు చక్కటి మసాజ్‌లా పని చేస్తుందంటున్నారు నిపుణులు. 

* లాఫ్టర్ యోగా చేసే క్రమంలో ఎక్కువసార్లు గాలి పీల్చుతూ, వదులుతూ ఉంటాం. ఈ క్రమంలో శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. 

* నవ్వడం వల్ల రక్తనాళాలు కాస్త వ్యాకోచిస్తాయి. తద్వారా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

* ఎంత నవ్వితే నొప్పిని భరించే శక్తి అంతగా పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. నవ్వే క్రమంలో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్‌గా భావించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవడమే ఇందుకు కారణం. 

నవ్వుతో..

నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు శరీరంలో విడుదలవుతాయి. ఈ యోగాతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు సుమారు 40 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

హ్యాపీ హార్మోన్లు

లాఫ్టర్ యోగా వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, డోపమైన్, సెరటోనిన్.. వంటి హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. 

-- అనిత అత్యాల

అనిత యోగ అకాడమీ

6309800109