వెల్లుల్లితో ఎన్నో లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వెల్లుల్లి నూనెతో కూడా బోలెడు లాభాలు ఉన్నాయని తెలుసా? వెల్లుల్లి నూనెతో కలిగే లాభాలేంటో చూద్దాం..
* వెల్లుల్లి నూనెలోని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* వెల్లుల్లి నూనె యాంటీ వైరల్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి నూనె కీలక పాత్ర పోషిస్తుంది.
* వెల్లుల్లిలోని యాంటీ ఇన్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, మొటిమలు, మచ్చలు, ముడతలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
* వెల్లుల్లి నూనెను తలకు పట్టిస్తే.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి నూనెతో తలనొప్పి కూడా తగ్గుతుంది.
* మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి నూనె కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇందులోని యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. కాటన్‌తో వెల్లుల్లి నూనెను ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నచోట అప్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.