calender_icon.png 28 November, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైక్లింగ్ బెనిఫిట్స్!

28-11-2024 12:00:00 AM

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అందుకే.. ఫిట్‌గా, ఆరోగ్యం గా ఉండటానికి చాలామంది జిమ్‌కి వెళ్లి చెమటలు పట్టే లా వ్యాయామలు చేస్తుంటారు. అంతేకాకుండా వాకిం గ్, జాగింగ్, యోగా చేయడం లాంటివి కూడా చేస్తారు. అలా కాకుండా చాలా ఈజీగా ఆహ్లాదకరంగా చేసే వ్యా యామం ఒకటి ఉంది. అదే సైక్లింగ్. ప్రతిరోజు పది నిమిషాలు సైక్లింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. 

ఫిజికల్ ఫిట్‌నెస్: సైక్లింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం. ఇది కాళ్లు, కండరాలు, ఎగువ శరీర కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బరువు తగ్గడం: సైక్లింగ్ కేలరీలను బర్న్ చేయడంలో బాగా సహాయపడుతుంది. ఎంత వేగంగా సైకిల్ తొక్కితే.. అంత వేగంగా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. 

మానసిక ఆరోగ్యం: వ్యాయామం చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.  

పర్యావరణహితం: సైక్లింగ్ పర్యావరణాన్ని కలుషితం చేయదు. ఇది ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా పర్యావరణానికి మేలు చేస్తుంది. 

వయసుతో సంబంధం లేదు: సైక్లింగ్ అన్ని వయసుల వారికి తగిన వ్యాయామం. చిన్నపిల్లలైనా, యువకులైనా, వృద్ధులైనా ఫిట్‌నెస్‌కు అనుగుణంగా సైకిల్ తొక్కవచ్చు. 

ఎలా ప్రారంభించాలి: సైక్లింగ్ తొక్కడం ప్రారంభించాలనుకుంటే.. మీకు అనుకులంగా ఉండే సైకిల్‌ను ఎంచుకోండి. మొదట తక్కువ దూరంతో ప్రారంభించండి.. క్రమంగా దూరం, వేగాన్ని పెంచండి. భద్రత కోసం హెల్మెట్ ధరించండి. సైక్లింగ్ కోసం తగిన దుస్తులు ధరించండి.