calender_icon.png 21 November, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉసిరితో లాభాలు!

21-11-2024 12:00:00 AM

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఉసిరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉసిరి సీజన్ వచ్చేసింది.. పెద్దమొత్తంలో తెచ్చుకుని ముక్కలుగా చేసుకుని ఎండబెట్టి కూడా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

* ఉసిరిలో ఉండే విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఉసిరిలోని టానిన్లు రక్తస్రావ నివారిణిగా పనిచేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పేగు కదలికలను నియంత్రిస్తుంది. 

* ఎండు ఉసిరిలోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పోషకాల గని అంటారు. బాగా ఎండిన ఉసిరి ముక్కలు ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి ఇది మెరుగ్గా పని చేస్తుంది. 

*  కొల్లాజన్ కణజాలాన్ని రక్షించి, వృద్ధాప్య లక్షణాలని రాకుండా చూస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఎండిపోయిన ఉసిరి ముక్కల్ని తింటే వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. 

*  చర్మంపై ఏర్పడే ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి పొడిలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై ముడతలు రాకుండా ఉసిరి కాపాడుతుంది. 

* ఉసిరి తీసుకోవటంతో నోటి పూతని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉసిరిని వాడటం మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉసిరిని తీసుకుంటే సులభంగా బరువు  తగ్గుతారు. 

* ఉసిరి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడటాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇది తలకు పోషణను ఇస్తుంది. చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.