calender_icon.png 10 March, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటికతో లాభాలు..

09-03-2025 12:00:00 AM

పటికలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పటికను వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. పటికలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడంలో సహాయప డతాయి. పటికతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

* పటికలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు పళ్లను తెల్లగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి. 

* పటిక యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చెమటను నియంత్రించడం లో సహాయపడుతుంది. పటికను టూత్ పేస్ట్ లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది దంతాలను బలోపేతం చేయడానికి, చిగుళ్ల వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. 

* సున్నితమైన చర్మం ఉన్నవారు దీన్ని వాడటం వల్ల చికాకు, దురద వంటి సమస్యలు దూరం అవుతాయి. 

* పటికను తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, ఇతర జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే వారు పటిక తినకుండా ఉండటం చాలామంచిది. 

* పటిక చర్మానికి సురక్షితమైనది. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.