calender_icon.png 27 December, 2024 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెన్‌ఫిట్ షోలు, టికెట్ ధరలు చిన్న విషయాలు: దిల్‌రాజ్

27-12-2024 03:59:52 AM

సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విష యాలని మీడియా అడిగిన ప్ర శ్నకు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు సమాధానమిచ్చారు. ఈ అంశా లు ముఖ్యమంత్రితో జరిగిన స మావేశంలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. హైదరాబాద్‌ను సినీ పరిశ్రమకు అంతర్జాతీయ హబ్‌గా చేసేందుకు చర్యలు తీసుకుంటామని  అయన చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు  మధ్య గ్యా ప్ ఉందనేది అపోహ మాత్రమేనన్నారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అంశాలను మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో మంచి స్పందన వస్తోందని, తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారని దిల్‌రాజ్ తెలిపారు.

హైదరాబాద్‌లో హాలీవుడ్ చిత్రీకరణలు జరిగేందుకు సీఎం సలహాలు కోరారని ఆయన తెలిపారు. చిత్రీకరణలకు ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏర్పాట్ల గురించి అడిగారని, ఎఫ్‌డీసీలో చర్చిం చి తెలంగాణ ప్రభుత్వానికి  15 రోజుల్లో నివేదికలు అందజేస్తామని దిల్‌రాజు వెల్లడించారు.