calender_icon.png 4 April, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు సహకార సంఘం ద్వారా లబ్ధి పొందాలి

03-04-2025 07:10:04 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): రైతులు సహకార సంఘాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనము, దుకాణ సముదాయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, డిసిసిబి అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విండో చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ... సంఘం నిర్వహణ పద్ధతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. అలాగే, సంఘానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి మరిన్ని నిధులు, ముఖ్యంగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్ ఇర్షాదుద్దిన్, సొసైటీ వైస్ చైర్మన్ పశుపతి, ఎయంసి వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు బి. భాస్కర్, నర్సవ్వ, ప్రవీణ్ కుమార్, భత్తుల రాములు, ఉమామహేశ్వర రావు, లక్ష్మా గౌడ్, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, గంగమణి, రాజేందర్ రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.