జిల్లా కలెక్టర్ రాజర్షి షా...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) సూచించారు. సిరికొండ మండలం రాయ్ గూడ, కొండాపూర్ పొన్న గ్రామాలతో పాటు ఆదిలాబాద్ లోని పలు కాలనీల్లో గురువారం పర్యటించి సంబంధిత అధికారులు చేస్తున్న రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వే సూపర్ చెక్ ల ఫీల్డ్ వెరిఫికేషన్ ను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈనెల 26న రిపబ్లిక్ డే పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, డి.ఎల్.పీ.వో ఫణీంద్ర, ఎంపిడిఓ, ఏఈఓ, ఏవో, తదితరులు ఉన్నారు.