calender_icon.png 22 January, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా లబ్దిదారుల ఎంపిక చేయాలి..

21-01-2025 06:18:18 PM

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక...

హుజురాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు వార్డుల్లో నిర్వహిస్తున్న లబ్దిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు పకబ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో మంగళవారం మున్సిపల్‌ పరిధిలో పలు వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారునికి పథకాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే అన్నీ వార్డుల్లో చాలా మంది లబ్దిదారులు దరఖాస్తులు చేసుకొని ఉన్నారని, కొంతమంది పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో వచ్చాయని, అర్హులైన వారందరికి లబ్ది జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. అర్హుల జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, లబ్దిదారులు వార్డు సభలను సద్వినియోగం చేసుకొని అర్హుల జాబితాల్లో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ సమ్మయ్య, కౌన్సిర్లు ప్రతాప్ తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యం రాజు, నల్ల లక్ష్మి, మాలపల్లి సుశీల, కేసిరెడ్డి లావణ్య, కల్లపల్లి రమాదేవి, ముక్క రమేష్ వార్డు అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.