16-04-2025 01:19:17 AM
తహసిల్దార్ కార్యాలయం ముట్టడి
చేగుంట, ఏప్రిల్ 15 : చేగుంట మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు సిపిఎం జిల్లా కార్యదర్శి బాలమణి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం 108 ఇండ్లు నిర్మించిందని, ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ మాకు అధికారికంగా ఇండ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే కొందరు లబ్దిదారులు ఇండ్లలో అనధికారికంగా నివాసం ఉంటున్నారని, దీంతో స్థానిక తహసిల్దార్ శ్రీకాంత్ లబ్ధిదారులకు బుధవారం వరకు ఖాళీ చేయాలని ఆదేశించారు.
బాధితులు మాట్లాడుతూ మాకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే ఇవ్వాలని లేనిపక్షంలో మాకు చావే శరణ్యమని హెచ్చరించారు. ఈ విషయంలో తహసీల్దార్ శ్రీకాంత్ను వివరణ కోరగా కొన్ని సమస్యలు ఉన్నాయని, దానిని ఇప్పటివరకు గుత్తేదారు ప్రభుత్వానికి కి అప్ప చెప్పలేదని. ప్రభుత్వనికి అప్పజెప్పిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లబ్ధిదారులను మళ్ళీ ఎంపిక చేసి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అప్పటివరకు ఎవరు కూడా అక్రమంగా ఇండ్లలో ఉండరాదని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.