calender_icon.png 19 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు కొలువులో బినామీ

11-04-2025 12:31:04 AM

  1. పలు శాఖల్లో యథేచ్ఛగా విధులు

నియామకమైన వారు పలు దందాల్లో నిమగ్నం

అరకొర వేతనాలతో బినామీలతో సేవలు

పట్టించుకోని అధికారులు

సంగారెడ్డి, ఏప్రిల్ 10(విజయక్రాంతి):ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బినామీలు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. సంబంధిత  కార్యాలయాల్లో సేవలందించాల్సిన పలువురు ఉద్యోగులు ఏళ్ళుగా విధులకు ఎగనామం పెడుతున్నారు. ప్రైవే ట్గా రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహిస్తూ తమ రెగ్యులర్ విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి.

అయితే ప్రభుత్వం నుంచి ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలు మాత్రం పొందుతున్నారు. తమకు బదులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వారికి కొంత ముట్టజెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారు. కొం తమందైతే బినామీలను కూడా నియమించడం లేదు.

తాము తీసుకునే వేతనంలో కొంత మొత్తాన్ని అధికారులకు అందజేస్తూ ఏళ్ళుగా కార్యాలయాల ముఖం కూడా చూడకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు మామూలుగా వ్యవ హరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. 

ప్రైవేట్ వ్యాపారాల నిర్వహణ...

సర్కారు కొలువు అనేది ప్రతీ నిరుద్యోగి కల. దాన్ని సాధించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. అలాంటిది ప్రభుత్వ ఉద్యో గం సాధించిన కొంత మంది ప్రబుద్ధులు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారాలు, ఇతరత్రా పనులకు ప్రాధాన్యమి స్తున్నారు. ఏళ్ళ తరబడి విధులకు ఎగనా మం పెడుతున్నారు. పోనీ ఏదైనా తీవ్ర అనారోగ్యం, పక్షపాతం, విధులు నిర్వహించలేని పరిస్థితి అంటే అదీ లేదు.

మరి దీర్ఘకాలిక సెలవు ఏదైనా పెట్టారా అంటే అదీ లేదు. విధులకు హాజరుకాకున్నా వచ్చినట్లుగా ఒక్కో ఉద్యోగి రూ.40వేల నుంచి రూ. 90వేల వరకు ప్రతినెలా వేతనం పొందుతున్నారు. అయితే వీరంతా తమకు బదులుగా బినామీలను నియమించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వారికి ఎంతో కొంత ముట్టజెప్పి తమకు ఉద్యోగపరంగా ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు మామూలుగా వ్యవహరిస్తుండడంతో బినామీలే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా చెలా మణి అవుతున్నారు. 

పలు శాఖల్లో ఇదే పరిస్థితి...

బినామీలు ఏ ఒక్క శాఖకో పరిమితం కాలేదు. కలెక్టరేట్ మొదలుకొని సంక్షేమ, మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, జిల్లా పరిషత్ తదితర శాఖల కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. అయితే వీరి ద్వారా ఇబ్బందేమీ లేదని అధికారులు భావిస్తున్నప్పటికీ రేపు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

కార్యాలయాల్లోని విలువైన వస్తువులు, ఇతరత్రా సామాగ్రి చోరీకి గురైతే ఎవరిని బా ధ్యులన చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం...

ప్రభుత్వ ఉద్యోగులకు బదులు ఇతర వ్యక్తులు విధులు నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఏళ్ళుగా విధులకు గైర్హాజరయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉంటుంది. ఏయే కార్యాలయాల్లో అలాంటి వారున్నారో విచారించి నిబంధనల ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటాం.

నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్