calender_icon.png 16 January, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్టుషాపులను పూర్తిగా కట్టడి చేస్తాం

11-09-2024 02:10:11 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

నల్లగొండ(విజయక్రాంతి)/మునుగోడు, సెప్టెంబర్ 10: మునుగోడు నియోజకవర్గంలో బెల్టుషాపులను కట్టడి చేస్తామని, తనపై వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గబోనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఊకొండి గ్రామంలో బెల్టు షాపులను స్వచ్ఛందంగా మూసేసిన నిర్వాహకులను మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సన్మానించి, మాట్లాడారు. నియోజకవర్గంలోని 159 గ్రామాల్లో ప్రతి బూత్‌లో బెల్టుషాపుల నియంత్రణ కమిటీలను నియమించామని చెప్పారు.