calender_icon.png 1 April, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల జోరు!

31-03-2025 12:00:00 AM

కాలనీల్లో వీధికో బెల్ట్ షాపు

మద్యంకు బానిసగా మారుతున్న యువత 

బెల్టు షాపులను తొలగించాలంటూ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

ఎల్బీనగర్, మార్చి 30 : ఎల్బీనగర్ శివా రు కాలనీలు  బెల్టు షాపులకు అడ్డాగా మారాయి. శివారు కాలనీల్లో ఎక్కడ చూసి నా వీధికోక బెల్ట్ షాపులు మనకు దర్శనం ఇస్తాయి. బెల్ట్ షాపుల కారణంగా పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కాలనీలలో  24  సులభంగా మద్యం అందుబా టులో ఉండడంతో... రోజువారీగా కూలి చేసుకుని జీవనం వెళ్లదేసుకునే వారంతా.. మద్యానికి బానిసగా మారుతున్నారు.  దీంతో రోజువారీగా పని  చేసుకొనే కూలీలు పని మానేసి, నిత్యం మద్యం తాగుతూ రోడ్ల పై జులాయిగా తిరుగుతున్నారు. దీంతో స్థానిక మహిళలు వ్యక్తిగత పనుల నిమిత్తం  బయటకు రావాలంటేనే చంపుతున్నారు.

మద్యం మత్తులో  ఉన్నవారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ   కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో వీధికొక బెల్ట్ షాపు ఉన్నది. ముఖ్యంగా నందనవనం, సాహెబ్ నగర్, హయత్ నగర్ డివిజన్ లోని రంగనాయకులగుట్ట, సుధీర్ కుమార్ కాలనీ, బంజారా కాలనీ, మన్సూరాబాద్, కొత్తపేట, నాగోల్, బీఎన్ రెడ్డి డివిజన్ లోని శివారు కాలనీల్లో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయి. శివారు కాలనీల్లో ఎక్కువ కూలీలు, వలసవచ్చిన వారు అధికంగా ఉంటారు.

శివారు కాలనీల ప్రజలు బెల్ట్ షాపులతోపాటు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయా కాలనీలు ట్రాన్స్ జెండర్లకు అడ్డాగా మారాయి. శివారు కాలనీలు కావడంతో గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతుందని స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యం, గంజాయి కి బానిసగా మారిన కూ లీలు తమ రోజువారి పనుల కు... వెళ్లకపోవడంతో  కుటుంబ పోషణ భారం అంతా మహిళలపై పడుతుంది. మహిళలు ఎక్కువగా పారిశుధ్య కార్మికులుగా, చెత్త సేకరణ కార్మికు లుగా పని చేస్తున్నారు. ఉపాధి కోసం పల్లెల నుంచి  పొట్ట చేత పట్టుకుని వచ్చిన కుటుంబాలు  కుటుంబ పోషణ భారమై ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిత్యం ఆయా కుటుంబా లలో మద్యం చిచ్చు రేపు తుంది.

వీటికితోడు ఆయా కాలనీలు ట్రాన్స్ జెండర్లకు అడ్డాగా మారాయి. సాయంత్రం వేళలలో అర్ధనగ్నంగా మారి, బహిరంగంగా వ్యభిచారరానికి పాల్పడుతున్నారు. రంగనాయకు లగుట్ట, సుధీర్ కుమార్ కాలనీ, బంజారా కాలనీల్లో సుమారు 50 మందికిపైగా ట్రాన్స్ జెండర్లు నివాసం ఉంటున్నారు. వీరికితోడు ఇతర ప్రాంతాల్లోలని ట్రాన్స్ జెండర్లు ఇక్కడి వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాలతో స్థానికంగా ఉంటున్న యువతులు, మహిళలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కాలనీల్లో బెల్ట్ షాపులు ఎత్తేయాల ని, రాత్రివేళలో పోలీసుల గస్తీ పెంచాలని, ట్రాన్స్ జెండర్ల అగడాలను అడ్డుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బెల్ట్ షాపులు తొలిగించాలి

హయత్ నగర్ డివిజన్లోని రంగనాయకులగుట్ట, సుధీర్కుమార్ కాలనీ, బంజారా కాలనీల్లో అనేక బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. సమయ పాలన లేకుండా ఎప్పుడంటే అప్పుడు సులభంగా మద్యం దొరుకుతుంది. మా కాలనీల్లో ఎక్కువగా కూలీలు నివసిస్తున్నారు. కూలీ పనులకు వెళ్లకుండా తాగుడుకు బానిసగా మారుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. బెల్ట్ షాపులు తొలిగించాలని, ట్రాన్స్ జెండర్ల అగడాలను అడ్డుకోవాలని ఇటీవల ఎక్సైజ్ పోలీసులతోపాటు లా అండ్ అర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం.

  మెగులయ్య, రంగనాయకులగుట్ట కాలనీ సంఘం అధ్యక్షుడు