11-02-2025 12:00:00 AM
ఇల్లందు/టేకులపల్లి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : ఇల్లందు నియోజకవర్గంలో సిండికేటుదారుల హవా కొనసాగుతోంది. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి అమ్మకం చేసిన పట్టించుకునే నాథుడే లేడు. సిండికేట్‌దారులు నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేస్తుండటంతో మద్యం ప్రియుల జేబులు చిల్లులు పడుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు మున్సిపాలిటీ ఇల్లెందు మండలం టేకులపల్లి మండలంలో సిండికేట్‌దారుల హవా మూడు బీరులు ఆరు క్వార్టర్లుగా చలామనీ అవుతుంది. ఏ వ్యాపారం చేయాలన్నా అనుమతులు తప్పనిసరి. విధిగా లైసెన్సులు తీసుకోవాలి.
అదే సిండికేట్ ఆధ్వర్యంలో బెల్ట్ షాపు వ్యాపారం చేయాలంటే ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దీంతో ముందు హోటలు వెనుక వైపు మందు సీసాల వ్యాపారం, చూస్తానికి పాన్ షాపు, నడిపేది మద్యం వ్యాపారం. ఇలా వందల సంఖ్యలో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అంటే ఎక్సుజ్ శాఖ పనితీరును తారీఫ్ చేయాల్సిందే.
అంతేకాదు ఎమ్మార్పీ ధరలకు మించి రూ.70 అదనంగా చెల్లించాల్సి వస్తుందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 20 మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ, మద్యం ప్రియులకు అవసరమైన బ్రాండ్ లభించదు. అదే బెల్టు షాపులో తప్పగా ఉంటుంది. సిండికేట్ వ్యాపారులు మద్యం షాపుల కంటే బెల్టు షాపులకే అధిక సరుకు పంపి ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వారు రూ.20 అదనం చెల్లించి సరుకులు తీసుకుంటున్నారని, దానిపైన మరో రూ.50 అదనంగా ధన నిర్ణయించి మద్యం ప్రియుల జేబులకు చెల్లి కొడుతున్నారని తెలుస్తోంది. అంటే ఎమ్మార్పీ ధర పైన బెల్ట్ షాపు యజమానులు ఒక్కో బాటిల్‌పై రూ.70 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్యం దుకాణంలో లభ్యం కావాల్సి మద్యం బాటిల్స్ కు బదులుగా ఇతర జిల్లా నుంచి తెచ్చిన బాటిల్స్ ను విక్రయించటం గమనారం. ఎంత జరుగుతుందో ఎక్సుజ్ అధికారులు అటువైపు తొంగి కూడా చూడకపోవడం విశేషం. టేకులపల్లి మండలంలో అధిక ధరలపై గతంలో ఆందోళన చేసిన వైన్ దుకాణాలను ధ్వంసం చేసిన సంఘటన లేకపోలేదు.
ఇదిలా ఉండగా మినీ మేడారం జాతర్లను పురస్కరించుకొని పల్లెల్లో గుడుంబా గొప్పంటోంది. ఇప్పటికైనా ఎక్సుజ్ అధికారులు సామాన్యుడి నడ్డివిరిచే సిండికేట్ గాళ్లపై దృష్టి సారించి వారి చెర నుంచి కాపాడాలని మద్యం ప్రియలు వేడుకుంటున్నారు.