21-04-2025 12:00:00 AM
ఏసీపీ రవికుమార్
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 20 : బెల్లంపల్లి పట్టణం అంటేనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులకు పుట్టి నిల్లు అని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణం తిలక్ స్టేడియంలో అడిచర్ల మహేష్ స్మారక సీజన్ _1 నియోజక వర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఏసీపీ రవికుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆడిచర్ల మహేష్ పట్టణంలో ఎంతో నైపుణ్యం గల పోటో గ్రాఫర్ అన్నారు.
ఆయన స్మారకార్థం ఇక్కడ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి తో ముందుకు వెల్లి జాతీయ స్థాయి లో రాణించాలన్నారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ పోటీలు ఈనెల 27వ తేదీ వరకు లీగ్ దిశగా కొనసాగుతాయన్నారు.16 జట్లు ఈపోటీలకు హాజరయ్యాయన్నారు.
ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్ దేవయ్య, తాండూర్ ఇన్స్ పెక్టర్ కుమార స్వామి, వన్ టౌన్ ఎస్త్స్ర నరేష్, ఆర్గనైజర్లు అడిచర్ల హరీష్,అడిచర్ల శివ, సుద్దాల వంశీకృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా పది ఓవర్లు గల మ్యాచ్ లో మొదట భవిత ఛాంపియన్స్ (బెల్లంపల్లి) గుడిపేట టైటాన్స్ జట్లు తల పడ్డాయి.