బెల్లంపల్లి,(విజయకాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పోలీసుశాఖ తరపున అందుతున్న సత్వర సేవల్లో మంచిర్యాల జోన్ లోని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు మూడవ స్థానం దక్కింది. సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి చట్ట పరిధిలో సమస్యని పరిష్కరించడం, పోలీసు శాఖపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కలిగించేందుకు సంబంధిత ఎస్హెచ్ఓలు, పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఆన్లైన్ ఫీడ్బ్యాక్ తీసుకున్న. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన పది పోలీస్ స్టేషన్ల లో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు మూడవ స్థానం దక్కింది. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో చొరవ చూపెడుతూ పోలీసు శాఖకు గౌరవాన్ని తెచ్చిన బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్. దేవయ్య, పోలీసు సిబ్బందికి రామగుండం సీపీ ఎన్. శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.