calender_icon.png 29 March, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు

26-03-2025 06:48:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ దాట్ల సతీష్ తెలిపారు. ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థులుగా న్యాయవాదులు సంగతి రాజేష్, అంకం శివకుమార్ లు పోటీ పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కోసం గాజం అనిల్ కుమార్, దాసరపు రాజు, జనరల్ సెక్రెటరీ కోసం చేను రవికుమార్, కనుకుంట్ల రాజేష్ పోటీ పడుతున్నట్లు చెప్పారు. జాయింట్ సెక్రటరీ కోసం ఎస్ సునీల్ కుమార్, ట్రెజరర్ కోసం ఉట్ల కుమార్, లైబ్రేరియన్ కోసం నల్లుల సంగీత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా న్యాయవాదులు ఎండి జుబేర్, టి. దేవరాజ్ కుమార్, బన్న శ్రీనివాస్, అడ్డూరి ప్రతాప్ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు.