calender_icon.png 25 October, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి, ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలి

12-09-2024 03:40:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసేలా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్కలు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐఎఫ్డిఎస్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ... ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో 9 పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించడం జరిగిందన్నారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆదిలాబాద్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో అప్గ్రేడ్ చేయకపోగా, వీటి ఊసే ఎత్తకపోవడం ఈ ప్రాంతాన్ని విస్మరించడమే అవుతుందని అన్నారు.

ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లి సభ సాక్షిగా హామీ ఇచ్చి సీఎం గా గెలిచిన రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క జిల్లాను అభివృద్ధి పదాలను నడిపిస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారన్నారు. 1980 లో ఆదిలాబాద్ లో, 1993లో బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారని ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఈ రెండు కళాశాలలను అప్గ్రేడ్ చేస్తామని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని అన్నారు. బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల కూడా కాకుండా కొంతమంది ఆపేశారని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఆదిలాబాద్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని వారు కోరారు.