బెల్లంపల్లి (విజయక్రాంతి): హైదరాబాదులోని షేక్ పేట్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో(సిఓఈ) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బెల్లంపల్లికి చెందిన ప్రథమ్ పాండే ఉత్తమ విద్యార్థిగా ఎంపికయ్యారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఉత్తమ విద్యార్థి అవార్డును దక్కించుకున్నారు. సీనియర్ ఆధ్యాపకులు గురువారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న విద్యార్థిని కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.