26-02-2025 12:00:00 AM
ఘనంగా జరుపుకున్న 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): బీహెచ్‌ఈఎల్ జడ్పీహెచ్‌ఎస్ 2000 బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠాలు నేర్పించిన పూర్వ ఉపాధ్యాయులు టీచర్లు హాజరయ్యారు. అనంతరం వారందరినీ శాలువాలు, పూలదండలు, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... మా పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, వారు అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించలని అన్నారు. విద్యార్థులు ఆట పాటలతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థుల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్‌ఎల్ జడ్పిహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.