నమ్మిన సిద్ధాంతం పేద ప్రజల కోసం పాటుపడాలి
ఫిష్ & గోట్ మాది కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
మునుగోడు (విజయక్రాంతి): పేద ప్రజల, అట్టడుగు వర్గాల కోసం తన బిడ్డను జాతికి అంకితం చేసిన వీర వనిత పార్వతమ్మ అని ఫిష్ & గోట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. ఇటీవల మృతి చెందిన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తల్లి నెల్లికంటి పార్వతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాలీలు అర్పించి మాట్లాడారు. ఆమె మరణం తీరని లోటని, సత్యమన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం కమిట్మెంట్తో నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల కోసం పాటుపడాలని ఆయన అన్నారు. ఆయన వెంట తాజా మాజీ యంపీపీ కర్నాటి స్వామి యాదవ్, కుండే వెంకటేష్ కురుమ, మాజీ సర్పంచ్ సూరిగి చలపతి, పాలకూర నరసింహ గౌడ్, ఈదులకంటి కైలాస్, తీర్పారి వెంకటేశ్వర్లు, శంకర్, కర్నాటి రాంబాబు యాదవ్, ఈద శరత్ బాబు ఉన్నారు.