calender_icon.png 9 January, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శకుడు చెప్పింది నమ్మి..

06-01-2025 12:00:00 AM

సందీప్‌రెడ్డి వంగా తెర కెక్కించిన ‘యానిమల్’ చిత్రంలో జోయా గా యువ హృదయాలను కొల్లగొట్టిన అందా ల తార త్రిప్తి డిమ్రి. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించిన పలు విషయాలను పంచుకుంది. తన కెరీర్ మలుపు తిప్పిన ‘యానిమల్’లో భాగం కావడానికి గల కారణమేంటో వెల్లడించింది. “యానిమల్’ను స్త్రీ ద్వేష చిత్రంగా నేనెప్పు డూ చూడలేదు.

సినిమాలకు అలాంటి ట్యాగ్స్ ఇవ్వను. ‘కోలా’, ‘బుల్బుల్’ చిత్రాలు చేస్తున్నప్పుడు వాటిని స్త్రీవాద చిత్రాలుగా భావించ లేదు. ఆయా కథల్లోని పాత్రకు కనెక్ట్ అయి.. దర్శకులపై నమ్మకం ఉంచి వాటిని ఎంచుకుంటా. ఈ సినిమాలో ఆఫర్ రాగానే దర్శకుడు సందీప్‌ను కలిశా. ఆయన నాకు కథ గురిం చి ఎక్కువగా చెప్పలేదు. జోయా పాత్ర గురించే వివరించారు.

అప్పటివరకు నేను సున్ని తమైన, పాజిటివ్ రోల్స్ మాత్రమే చేశాను. ‘యానిమల్’ లో నా పాత్రకు ఇందుకు భిన్నమైంది. మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. దయ, సాను భూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు.

అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పాను. దర్శకుడు చెప్పింది నమ్మడం వల్లే సక్సె స్ చూశా” అని వివరించింది త్రిప్తి. నిరుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన త్రిప్తి ప్రస్తుతం ‘ధడక్ 2’లో నటిస్తోంది.