calender_icon.png 9 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బెల్గావి - మణుగూరు ప్రత్యేక రైళ్లు

12-10-2024 01:33:55 AM

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బెల్గావి - మణుగూరు మధ్య వారా నికి 4 రోజుల పాటు తిరుగే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. కర్ణాటకలోని బెల్గావి (బెల్గామ్) నుంచి తెలంగాణలోని మణుగూరు మధ్య ఎగువ, దిగువ కలిపి మొత్తం 190 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు బెల్గావి - మణుగూరు (రైలు నెంబర్ 07335) సర్వీసులు, ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు మణుగూరు  బెల్గావి సర్వీసులు (రైలు నెం. 07336) నడుస్తాయని అధికారులు             వెల్లడించారు.