calender_icon.png 23 February, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెకెమ్ ఇన్‌ఫ్రాకు జాతీయ పురస్కారం

23-02-2025 12:57:26 AM

హైదారాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అనేక పారిశ్రామిక ప్లాంట్ల నిర్మాణాలు, కట్టడాలు చేపట్టి ఇంజినీరింగ్‌లో నూతన ఒరవడి సృష్టించిన బెకెమ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జాతీయ ఇంజినీరింగ్ అవార్డు లభించిం ది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వేడుకల్లో ఈపీసీ వరల్డ్ సంస్థ పురస్కారాన్ని అందజేసింది. బెకెమ్ ఇన్‌ఫ్రాతో పాటు ఎల్ అండ్ టీ, టాటా ప్రాజెక్ట్స్, బోరిడ్జ్ అండ్ రూఫ్, కేఈసీ ఇంటర్నేషనల్, ఏఈసీఓఎం, అశోక బిల్డ్‌కాన్, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, ఎన్‌ఆర్‌సీటీసీ, ఈజీఎస్, ఇర్కాన్‌లు సైతం ఈ అవార్డులు సొంతం చేసుకున్నాయి. గ్రాం డ్ జరిగిన అవార్డుల అందజేత కార్యక్రమంలో పారిశ్రామిక వర్గాల నాయకులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, విధాన రూపకర్తలు, బ్యాంకర్లు, కన్సల్టెంట్లు భాగస్వాములయ్యారు.