calender_icon.png 16 January, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అయి ఉండి.. ఆ మాటలా?

11-07-2024 01:52:17 AM

మాజీ ఎమ్మెల్యే కిశోర్

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకులు నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసి చనిపోతే పీడ పోతుందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కిశోర్ మండిపడ్డారు. బుధరవారం మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం కేటీఆర్, హరీశ్‌రావులు దీక్ష చేసి చనిపోతే పీడ  పోతుందని ముఖ్యమంత్రి అంటున్నారని,  సీఎం స్థాయిలో ఉండి మాట్లాడే మాటలు ఇవేనా అని, మేం తెలంగాణ కోసం అనేక దీక్షలు, ఉద్యమాలు చేశాం, వందల కేసులు మాపై పెట్టారు.. జైళ్లకు పోయాం..  అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్.. అని ప్రశ్నించారు.  రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆయన నీట్ రద్దు గురించి మాట్లాడినందుకు దీక్ష చేయమని చెబుతావా .. ఆయన కూడా దీక్ష చేస్తూ చచ్చిపోవాలంటావా అని ప్రశ్నించారు.