calender_icon.png 11 November, 2024 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురు అంటూనే సెక్స్ బానిసగా..

06-09-2024 12:04:19 AM

  1. తమిళ దర్శకుడిపై నటి సౌమ్య సంచలన ఆరోపణలు 
  2. ఏడాదిపాటు అత్యాచారం చేశాడని వెల్లడి 
  3. డైరెక్టర్ పేరు చెప్పేందుకు నిరాకరణ 
  4. దర్యాప్తు బృందానికి పూర్తి వివరాలు చెబుతానని స్పష్టం

చెన్నై, సెప్టెంబర్ 5: క్యాస్టింగ్ కౌచ్‌పై జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ సెగ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి తాకింది. ఓ తమిళ డైరెక్టర్‌పై నటి సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆ దర్శకుడు తనపై చాలా రోజులు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తననో సెక్స్ బానిసలాగా వాడుకున్నాడని ఆరోపించారు. కూతురు అంటూ పిలుస్తూనే నీచంగా ప్రవర్తించేవాడని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య వెల్లడించారు. సదరు దర్శకుడు మర్మాంగాల్లో రాడ్ చొప్పించి పైశాచిక ఆనందం పొందేవాడని తెలిపింది. 

కూతురు అంటూనే నీచ ప్రవర్తన

ఇంటర్వ్యూలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సౌమ్య నిర్మొహమాటంగా వెల్లడించింది. దర్శకుడి పేరు చెప్పేందుకు నిరాకరించిన సౌమ్య.. దర్యాప్తు బృందానికి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తనను ఆ వ్యక్తి ఓ సెక్స్ బానిసలాగా ఎలా మార్చుకున్నాడో వివరించింది. సినిమాల్లోకి అడుగుపెట్టాలని చిన్ననాటి నుంచే కోరిక ఉండేది. 18 ఏళ్లకు తెలిసినవారి ద్వారా సినిమాలో అవకాశం వచ్చింది. ఇంట్లోవాళ్లకు దర్శకుడు నచ్చజెప్పి ఒప్పించగా వాళ్లు అంగీకరించారు.

అయితే, మొదటిసారి మాట్లాడినప్పుడు అతని ప్రవర్తన నాకు నచ్చలేదు. అతని భార్య ముందు నన్ను కూతురులాగా సంబోధించేవాడు. కొంతకాలానికి నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నిజానికి మొదటి సినిమాకు అతని భార్య దర్శకత్వం వహిస్తారని చెప్పారు. కానీ సినిమా మొత్తాన్ని ఆయనే డైరెక్ట్ చేశాడు. ఓసారి ఆయన భార్య లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ సమయంలో నాకు ఇవన్నీ ఏమీ తెలీదు. చాలా రోజులు మానసికంగా కుంగిపోయా అని సౌమ్య వివరించారు.