01-04-2025 12:00:00 AM
ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రమాద పరిస్థితి చురుగ్గా ఉండే దేశాలలో మయన్మార్ ఒకటి. అంతేకాదు, ఈ దేశ భూభాగం రెండు టెక్టోనిక్ ప్లేట్లమధ్య, సరిహద్దులో నెలకొని ఉంది. అయినప్పటికీ సాగింగ్ ప్రాంతంలో పెద్ద, విధ్వం సకర భూకంపాలు చాలా అరుదు. ఆశ్చర్యకరంగా అక్కడి రెండో అతిపెద్ద నగరమైన మండలే దగ్గరలోని సాగింగ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఇటీవలి భూకంపం 7.7 తీవ్రతతో అసాధారణ వినాశనానికి కారణమైంది. అత్యంత శక్తివంతమైన ఈ భూవిపత్తు ఆ దేశంలో అపార నష్టాన్ని కలిగించడమేకాక శుక్రవారం పొరుగున ఉన్న థాయిలాండ్‌ను కూడా కుదిపేసింది.
ఇండియా, యురేషియా ప్లేట్స్‌మధ్య, ఇంకా సరిహద్దు ప్రదేశంలోనే దాదాపు ఉత్తర -దక్షిణంగా దేశ భూభాగం మధ్యలో కత్తిరించినట్టుగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని ప్రొఫెసర్, భూకంప నిపుణురాలు జోవన్నా ఫౌర్ వాకర్ అభిప్రాయపడ్డారు. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదాని కొకటి వేర్వేరు వేగంతో అడ్డంగా కదులుతాయని కూడా ఆమె చెప్పా రు. “దీనివల్ల స్ట్రైక్ స్లిప్ భూకంపాలు సంభవిస్తాయి. ఇవి సాధారణంగా సుమత్రా వంటి సబ్డక్షన్ జోన్లలో కనిపించే వాటికంటే తక్కువ శక్తివంతమైనవి. ఇక్కడ ఒక ప్లేట్ మరొక దానికిందకు జారిపోతుంది. అవి ఇప్పటికీ 7 నుండి 8 భూకంప తీవ్రతకు చేరుకుంటాయి” అని నిపుణులు అంటున్నారు.
ఇటీవలి సంవత్సరాలలో సాగింగ్‌లో అనేక భూకంపాలు సంభవించాయి. 6.8 తీవ్రతతో సంభవించిన సంఘటన 2012 చివరిలో కనీసం 26 మంది మరణాలకు, డజన్లకొద్దీ ప్రజల గాయాలకు కారణమైంది. కానీ,“ఇటీవలి దుర్ఘటన మయన్మార్ ప్రధాన భూభా గాన్ని మూడు త్రైమాసికాల్లో తాకిన దానికన్నా బహుశా అతిపెద్దది” అని మరొక భూకంప నిపుణుడు బిల్ మెక్గ్యురే చెప్పారు. బ్రిటిష్ జియోలాజికల్ సర్వేలో గౌర వ పరిశోధనా సహచరుడు రోజర్ ముస్సన్ ‘రాయిటర్స్’ వార్తాసంస్థతో మాట్లాడుతూ, భూకంపం నిస్సార లోతు అంటే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఈ స్థాయిలో, ఇటీవలి భూకంప శక్తులను తట్టుకునేలా ఇళ్ళు నిర్మించుకోవడం దాదాపు అసంభ వమని ముస్సన్ అంటున్నారు.
- గడీల ఛత్రపతి