calender_icon.png 22 February, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గబ్బిలాల శబ్దం వెనుక..

20-02-2025 12:00:00 AM

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. లక్ష్మీ మేనన్, లైలా, సిమ్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ మొత్తం వింత శబ్దాల చుట్టూ తిరిగింది.  2009లో ఆది, అరివళగన్ కాంబోలో ‘వైశాలి’ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

గబ్బలాల శబ్దం వెనుక రహస్యాన్ని కనిపెట్టే ఇన్వెస్టిగేటర్‌గా ఆది పినిశెట్టి నటించాడని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మొత్తంగా సినిమా అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని ట్రైలర్ చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది. 7 జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.