calender_icon.png 29 April, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక రీచ్ ప్రారంభం

28-04-2025 04:37:43 PM

జైపూర్/చెన్నూర్ (విజయక్రాంతి): జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీప గోదావరి నది బ్రిడ్జి వద్ద జిల్లా ప్రజల సౌకర్యార్థం మరొక నూతన ఇసుక రీచ్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ రేట్ కు మన ఇసుక వాహనం ద్వారా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని, సమీప గ్రామ పంచాయతీల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డి, ఎంపిడిఓ జి సత్యనారాయణ, ఎంపీఓ బాపు రావు, పంచాయితీ కార్యదర్శి ఏ సుమన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.