calender_icon.png 21 January, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేలలో గురుకుల పాఠశాల ప్రారంభం

07-07-2024 02:51:36 AM

ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేలలో నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్.. మండల ప్రత్యేక అధికారి శంకర్, ఆర్సీవో గోపిచంద్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తిచేశామరని ఆర్సీవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బేలకు మహాత్మా జ్యోతిబా పూలె గురుకులం గతంలోనే మంజూరైందని.. ప్రభుత స్థలం లేకపోవడంతో దీనిని ఆదిలాబాద్‌లోనే కొనసా గించారాని పేర్కొన్నారు. కొంత మేర మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుతం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ లోని ప్రభుత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘ఎక్ పేడ్ మాకే నామ్’ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.