పాడె వదిలేసిపారిపోయినజనం
38 మంది నికుట్టిన తేనె టీగలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): శవయాత్రపై తేనె తీగలు ఒక్క సారీగా దాడి చేశాయి. దీంతో పాడే వదిలేసి జనం పారిపోయారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు స్మశాన వాటిక మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఏఎంసీ ఏరియాలోని బూడిదిగడ్డ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆడేటి శ్రీనివాస్(40) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. శవ యాత్ర నిర్వహిస్తుండగా వాటర్ ట్యాంకుకు ఉన్న తేనె తీగల గుంపు శవ యాత్రపై దాడి చేయడంతో పాడెను వదిలిపెట్టి జనం పరుగులు తీశారు. బాధితులు ఆ పక్కనే ఉన్న తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా 38 మందిని పరీక్షించిన వైద్యాదికారి ఎవాంజలిన వారికి వైద్య పరీక్షలు అందజేశారు. గంట తర్వాత వచ్చి అంత్య క్రియలు పూర్తి చేశారు.