calender_icon.png 25 February, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరు ధరలు అడ్డగోలుగా పెంచేశారు

13-02-2025 02:11:21 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిందని శ్రీనివాస్ గౌ డ్ ఆరోపించారు. బీరు ధరను రూ.30 వరకూ పెంచిందని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ హయాంలో నామమాత్రంగా ధర లు పెంచితే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారని.. అడ్డగోలుగా బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. ప్రభుత్వం నాణ్యతలేని బీర్లను తీసుకొస్తుందని ఆరోపించారు. బెల్టు షాపులు బంద్ చేస్తామంటూ ఎన్నికలకు ము ందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మద్యం మాఫి యా నడిపిస్తోందని ఆరోపించారు.