పూర్వం ఆంధ్రా ప్రాంతంలో కరణం మునసబు, తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీలు ఉండేవారు. వీరు సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. అయితే అం తకుముందు మునుసబు వ్యవస్థ ఉంది. వీరు జమీందారీ వ్యవస్థలో, బ్రిటీష్ కాలంలో గ్రామపాలకులుగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆ సమయంలో జమీందారీ గారి ఆస్తుల వ్యవహారాలు, రెవెన్యూ రికార్డులను ఓ పెట్టెలో భద్రంగా దాచేవారు. దీనినే ‘మునుసబు పెట్టె’ అంటారు. కీలక దస్తావేజులు, భూమి పత్రాలు వీటిలో భద్రంగా దాచేవారు. ఆ కాలంలో మునసబు పెట్టె భద్రమైన బీరువాగా చెలామణి అయ్యింది.