13-02-2025 01:37:19 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి), ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దేవుడు ఎరుగు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అమ్మడానికి తెచ్చిన సోయా ధాన్యాన్ని అధికారులు కొనడం లేదు. కామారెడ్డి జిల్లా మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 8000 కింటల్లా సోయా ధాన్యం పెట్టుకొని గత 45 రోజులుగా సోయా రైతులు పడి గాపులు పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయిపిస్తామని చెప్పడమే తప్ప నలభై ఐదు రోజులు కావస్తున్నా సోయా పంటను కొనడం లేదు.
మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలోని 80 మంది వరకు రైతులు సోయా ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. సోయదాన్యంతో కొనుగోలు కేంద్రంలో నే పడిగాపులు పడుతున్నారు. తాము కొనుగోలు కేంద్రానికి నీకి అమ్మకానికి తెచ్చిన సోయా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్న రైతుల మాటలను పెడచెవిన పెడుతున్నారు.
80 మంది వరకు రైతులకు చెందిన 8 వేల క్వింటాల సోయా లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు లోనే రైతులు సోయా ధాన్యం నిలువలు పెట్టుకుని పడిగాపులు పడుతున్నారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తోపాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై సైతం రైతులకు హామీలు ఇచ్చారు. మూడు నాలుగు రోజుల్లో కొనుగోలు చేస్తామని మార్కెట్ జిల్లా అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్మయిలు తెలుపగా ఇప్పటివరకు పత్తా లేకుండా పోయారు.
ప్రజా ప్రతినిధులు సైతం రైతులకు అండగా ఉన్నట్లు చెప్పారు తప్ప ఇంతవరకు సోయా లను కొనుగోలు చేయించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సోయా పంటను కొనుగోలు చేయగా చివరి సమయంలో రైతులు అమ్మ డానికి తెచ్చిన సోయాలు 8 వేళ్ళ క్వింటాళ్ల ను మాత్రం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అధికారుల ప్రజాప్రతినిధుల హామీలకు తమ సోయా పంటను కొనుగోలు చేస్తారని గంపెడు ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
అధికా రులకు ప్రజా ప్రతినిధులకు కనికరము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కొనుగోలు చేస్తారో నని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులు కావస్తున్న సోయా ధాన్యాన్ని మాత్రం కాంటా పెట్టడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సోయా ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని భావించిన రైతులకు పడరాని పాట్లు పడుతున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సైతం మద్నూర్లో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన సోయా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులు తమ సమస్యలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారని సంతోషమే తప్ప తమ సోయ ధాన్యాన్ని మాత్రం కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దళారి వ్యాపారులకు విక్రయిస్తే సగం ధర కూడా రాదని తీవ్రంగా నష్టపోతామని రైతులంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఎనిమిది వేల క్వింటాళ్ల సోయా ధాన్యాన్ని కొనుగోలు చేసి తమ కష్టాలను తీర్చాలని రైతులు కోరుతున్నారు.
సోయా రైతులు ఆందోళన చెందవద్దు
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కొనుగోలు కేంద్రం మూతపడడం వల్లనే సోయా ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపో యారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది లను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ మార్క్ పేడ్ చైర్మన్‌ల దృష్టికి తీసుకువెళ్లినట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని త్వరలోనే కొనుగోలు చేయిస్తానని తెలిపారు.