calender_icon.png 12 December, 2024 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా

12-12-2024 12:53:29 AM

కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బీడీ కార్మికులకు పెన్షన్ రూ.4,016 చెల్లించాలని కోరారు. ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన మాట ప్రకారం బీడి కార్మికుల పెన్షన్ రెట్టింపు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.