ఇరాన్‌ను నిలువరించేందుకు పంపిన అమెరికా
న్యూఢిల్లీ, నవంబర్ 3: అమెరికా తమ దేశానికి చెందిన బి స్ట్రాటోఫొర్ట్రెస్ యుద్ధ విమానాలను పశ్చి మాసియాకు పంపింది. ఈ విషయాన్ని యూఎస్‌ఏ సెంట్రల్ కమాం డ్ వెల్లడించింది. ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలను మోహరిస్తామని హెచ్చరించిన ఒక్కరోజు వ్యవధిలోనే విమానాలు గల్ఫ్‌కు చేరడం విశేషం.
‘మినాటో ఎయిర్‌బేస్‌లోని 5వ బాంబ్‌వింగ్‌కు చెందిన బీ స్ట్రాటజిక్ బాంబర్లు ఇప్పుడే సెంట్రల్ కమాండ్ ప్రాంతానికి చేరాయి.’ అని సెంట్‌కామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాగా అమెరికా యుద్ధవిమానాలతో పాటు బాలిస్టిక్ మిస్సైళ్లను, ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లనూ తరలించింది. ఈ సందర్భంగా పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్ మాట్లాడుతూ.. ఇరాన్, దానికి మద్దతునిస్తున్న సంస్థలు అమెరికా సైన్యం ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్ని స్తే.. తమ వారిని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.