calender_icon.png 22 October, 2024 | 2:42 AM

హుతీలపై బీ బాంబర్లు

18-10-2024 01:22:49 AM

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికా సైన్యం వద్ద బయటి ప్రపంచానికి తెలియని ఆయుధాలు, కొంగొత్త యుద్ధ విమానాలు ఎన్నో ఉన్నాయని ప్రచారంలో ఉన్నది. అందులో కొన్నింటిని అప్పుడప్పుడూ ఆ దేశం బయటకు తీస్తు ఉంటుంది. కానీ, వాటి గురించి ఇతర దేశాలకు పెద్దగా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అలాంటిదే బీ బాంబర్. చూడ్డానికి అచ్చం గబ్బిలం మాదిరిగా కనిపించే అ యుద్ధ విమానం భూమిపై అత్యంత శక్తిమంతమైనదని భావిస్తున్నారు. దీనిని అమెరికా ఎక్కడపడితే అక్కడ వాడదు.

తాజాగా దీనిని బయటకు తీసింది. యెమెల్‌లో హుతీ ఉగ్రవాదులపై ఈ బాంబర్‌తో దాడులు చేసింది. ప్రభుత్వంతో పోరాడుతున్న హుతీలు యెమెన్‌లో భూగర్భంలో భారీ ఆయుధ బాంఢాగారాలనే నిర్మించారని సమాచారం. వాటిని నాశనం చేయటానికి బీ బాంబర్ల ద్వారా బుధవారం శక్తిమంతమైన బాంబులను జార విడిచి ఆ సొరంగాలను ధ్వంసం చేసినట్లు తెలిసింది.