calender_icon.png 11 March, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్ కడల్స్‌లో బెడ్ వెట్టింగ్ క్లినిక్

10-03-2025 12:08:09 AM

250 మంది వైద్యుల హాజరు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ డా. మౌనిక మోటమర్రి ఆధ్వర్యంలో ఆదివారం నెఫ్రో-యూరో సమిట్ 2025 పేరుతో కంటిన్యువ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి పీడియాట్రిక్ నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల వైద్యులు 250 మంది హాజరయ్యారు.

మౌనిక మోటమర్రి మాట్లాడుతూ.. ఐదేళ్లు దాటినా కూడా పక్కతడిపే అలవాటు చాలామంది పిల్లలకు ఉంటుందని, దాని గురించి బయటకు చెప్పడానికి సిగ్గుపడి చెప్పకపోవడం వల్ల ఆ సమస్య పెద్దయినా కూడా అలాగే ఉంటుందని.. అలాంటి సమస్యల పరిష్కారానికి కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం బెడ్ వెట్టింగ్ క్లినిక్ పనిచేస్తుందని చెప్పారు.

ప్రధానంగా చిన్న పిల్లలకు కూడా కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయని, వాళ్లు నొప్పి అని చెప్పినప్పుడు, మూత్రంలో రక్తం చారికలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యూరాలజిస్టులకు చూపించాలని.. అలా వదిలేస్తే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు చెప్పారు. దీనికి సరైన పరిష్కారం మాత్రం తమ బెడ్ వెట్టింగ్ క్లినిక్‌లో దొరుకుతుందని డాక్టర్ మౌనిక మోటమర్రి తెలిపారు.

కిమ్స్ సికింద్రాబాద్, కొండాపూర్ ఆస్పత్రులలో ప్రతి మంగళవారం బెడ్ వెట్టింగ్ క్లినిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంకా డాక్టర్ బాబు ఎస్.మదార్కర్, డాక్టర్ యోగ నాగేందర్, డాక్టర్ పరాగ్ డెకాటే, డాక్టర్ అపర్ణ సి., డాక్టర్ వి.ఎస్ రెడ్డి, డాక్టర్ నితిన్ చావ్లా తదితరులు పాల్గొన్నారు.