మహబూబ్ నగర్, జనవరి 2౮ (విజయ క్రాంతి) : బీఈడీ చదువుతున్న విద్యార్థులకు ప్రశ్న పత్రం తెలుగులో ఇవ్వాలని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగధిపతి డాక్టర్ రాజ్ కుమార్, హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డాక్టర్ జంగం విశ్వనాథంలకు తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కార్యదర్శి నల్లవెల్లి భరత్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరం బిఈడి చదువుతున్న విద్యార్థు లకు పరీక్ష పత్రం గత సంవత్సరం ఇచ్చినట్లు గానే ఇంగ్లీష్, తెలుగులో ఇవ్వాలని కోరారు. బిఈడి కళాశాలలో బోధించే అధ్యాపకులు కూడా 99% తెలుగులోనే బోధన చేస్తున్నా రు. ఏడాది తెలుగులో ఇచ్చేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు వంశీ కుమార్ , బీ.ఈ.డీ. అభ్య ర్థుల సంఘం జిల్లా నాయకులు ఆంజనేయు లు రమేష్ నాగరాజు సురేష్ పాల్గొన్నారు.