ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, నవంబర్ 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, సమీకృత మార్కెట్ సమీపంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు కేంద్రం ఉత్తర తెలంగాణాకే తలమానికంలా ఉండబోతుందని మంచిర్యాల ఎమెమ్ల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. బుధవారం ఐబీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 21న మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధ్‌బాబు, సీతక్క 650 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేయనున్నారని తెలిపారు. భవిష్యత్తులో 1,200 పడకల స్థాయికి పెంచడమే తన లక్ష్యమన్నారు. మంచిర్యాలను మెడికల్ హబ్‌గా మారబోతుందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.360 కోట్లు అవసరముండగా మొదటి విడతగా రూ.50 కోట్లు బడ్జెట్‌లో ఆమోదం తెలిపారన్నారు.
నాలుగు తరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనుందన్నారు. రెండున్నర సంవత్సరాల్లో వైద్య సేవలు అందేలా చూస్తానన్నారు. మీడియా సమావేశంలో ము న్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, నస్పూర్ చైర్మన్ సుర్మిల్ల వేణు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూద రి తిరుపతి, నాయకులు వేముల సంజీవ్, బానేష్, గడ్డం త్రిమూర్తి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.