02-03-2025 12:56:37 AM
మంత్రి పొంగులేటి చొరవతో రూ.45.50 కోట్లు మంజూరు
కూసుమంచి, మార్చి 1: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి కేంద్రంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.45.50 కోట్లు మం జూరు చేసింది. గత ఎన్నికల ప్రచారంలో 100 పడకల ఆసుపత్రిని మం జూరు చేయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రిని మంజూరు చేయించారు.
అలాగే మంత్రి పొంగులేటి చొరవతో ఆసుపత్రి నిర్మాణానికి రూ.45.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. మంత్రి పొంగులేటికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.