calender_icon.png 24 February, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యూటీ.. బీస్ట్ సత్యభామే!

24-02-2025 12:00:00 AM

‘సత్యభామ అంటే ఏదో చందమామ కథలు చెప్పే బామ్మ అనుకున్నావేమో! ఇక్కడ సత్యభామ రా.. ఇక్కడ బ్యూటీ నేనే.. బీస్ట్ నేనే!!’ అంటూ ఆనంది చెప్పిన డైలాగ్ అమి తంగా ఆకట్టుకుంది. ‘వంగేవాళ్లు ఉన్నంత వరకు మింగేవాళ్లు ఉంటారు, నేను వంగే రకం కాదు.. మింగే రకం’ అన్న మరో బోల్డ్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శివంగి’.

ఇటీవలే ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఒక క్రైమ్ సీన్‌ను ప్రజెంట్ చేస్తూ ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆనంది జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు తనను వెంటాడుతాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశాలతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది.

ఇందులో ఆనంది సత్యభామ అనే పాత్రలో పోషిస్తోంది.. ఆ క్యారెక్టర్‌లో ఆమె నటన ఆకట్టుకుంటోంది. వరలక్ష్మిశరత్‌కుమార్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో కట్టిపడే సింది. మొత్తంగా ఈ టీజర్.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిందని చెప్పాలి.

దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేశ్‌బాబు పీ నిర్మించిన ఈ సినిమాలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 7న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: భరణి కే ధరన్; సంగీతం: ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్; ఆర్ట్: రఘు కులకర్ణి; పాటలు: సాహితీ చాగంటి; సాహిత్యం: శ్రీనివాస్ కామేపల్లి, దేవరాజ్ భరణి ధరన్.