calender_icon.png 20 October, 2024 | 12:52 AM

బ్యూటీ సీక్రెట్!

09-07-2024 12:05:00 AM

* కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. 

* ఇవి మొటిమల నివారణకు సహాయపడతాయి. 

* కొబ్బరి నూనెలోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం కలిగి ఉంటుంది. మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే          సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

* ఈ నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

* రోజువారీ ఆహారంలో కొబ్బరి నూనె తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

* జుట్టుకు కొబ్బరి నూనెను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మంచి హెయిర్ కండీషనర్‌గా పని చేస్తుంది.