calender_icon.png 28 October, 2024 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతాబు లాంటి అందం..!

02-07-2024 12:05:00 AM

వెండితెరపైకి సామాజిక అంశాలను తీసుకురావడంలోనే కాదు.. ప్రేక్షకులకు కనులవిందైన అందా లను చూపించడంలోనూ దర్శకుడు శంకర్ సిద్ధహస్తుడు. ఊర్మిళ మటోంద్కర్, మనీషా కొయిరాలా, ఐశ్వర్యరాయ్ లాంటి భారతీయ భామామణులతో పాటు యానా గుప్తా, అమీ జాక్సన్ వంటి విదేశీ సోయాగాలతోనూ తన సినిమాలకు సొబగులు అద్దిన ఆయన, తాజాగా మతాబు లాంటి మరో విదేశీ అందాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ చిత్రం ఈ నెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి గాను దక్షిణాఫ్రికాకు చెందిన డెమీ లీ టెబోను రంగంలోకి దింపారు శంకర్. ‘క్యాలెండర్ సాంగ్’ పేరిట అనిరుధ్ స్వరాలందించిన ఈ గీతం సోమవారం విడుదలైంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని శ్రావణ భార్గవి గానం చేశారు. మోడల్ అయిన డెమీ 2017లో మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకుని ‘భారతీయుడు 2’ చిత్రం ద్వారా సరాసరి దక్షిణ భారత చిత్రసీమకు దిగుమతి అయ్యారు. ఈ అందాన్ని చూస్తుంటే పాటలో బోస్ గారు అన్నట్టు ‘పాలపుంతల్లో వాలి.. జంట మేఘాలై తేలి.. భూమితో పనిలేకుండా గడిపేద్దామా..?’ అని పాడుకోవాలపిస్తోంది కదూ..!