calender_icon.png 23 December, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ ఏఐకి అందాల కిరీటం!

23-07-2024 12:00:00 AM

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా.. వంటి అందాల పోటీల గురించి మాత్రమే మనకు తెలుసు! అయితే ఇటీవలే ఈ జాబితాలో ‘మిస్ ఏఐ’ కూడా చేరిపోయాయి. నిజానికి ఈ పోటీలు కృత్రిమ మేధతో సృష్టించిన మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం! ‘ఫ్యాన్ వ్యూ’ అనే సంస్థ తొలిసారి నిర్వహించిన ఈ పోటీల్లో.. మొరాకోకు చెందిన కెంజా లేలీ తొలి విజేతగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1500 కంప్యూటర్ జనరేటెడ్ మోడల్స్ పోటీపడగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దీనికి గాను రూ.16 లక్షల ప్రైజ్ మనీ బహుమతిని సొంతం చేసుకుంది. ఈ మొత్తం తన క్రియేటర్ మిరియం బెస్సాకే దక్కుతుందని చెప్పొచ్చు. కెంజా రూపకర్త మిరియం అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. ఆమెకు ‘ఫోనెక్స్.ఏఐ’ అనే సంస్థతో పాటు, మరో డిజిటల్ ఏజెన్సీనీ నడుపుతున్నది.

కెంజాకు సంబంధించిన ప్రతి ఫొటో, వీడియో, ఆడియో, కంటెంట్.. వంటివన్నీ కృత్రిమ మేధతోనే రూపొందించినట్లు చెబుతోంది మిరియం. కెంజాకే కాదు.. ఇతర దేశాలకు చెందిన మరింతమంది ఏఐ ఇన్‌ప్లుయెన్సర్లకూ ప్రాణం పోసింది మిరియం. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన ‘జరా శతావరి’ మొదటి పదిస్థానాల్లో నిలవడం గమనార్హం. ఈ ఇన్‌ప్లుయెన్సర్ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హార్మోన్ సమస్యలు, పీసీఓఎస్, డిప్రెషన్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది. ఈమె ఇన్‌స్టా ఖాతాను 15 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డు ఆర్గనైజ్ చేసిన ఈ పీజియంట్.. బ్యూటీ, టెక్నికల్ స్కిల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ బేస్ చేసుకొని ఈ అవార్డులు ఇస్తున్నారు.