calender_icon.png 21 January, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రాల చెరువును సుందరీకరించాలి

05-07-2024 12:24:47 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, జూలై 4: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రాల చెరువు సుందరీకరణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించా రు. నంది విగ్రహం ఏర్పాటుతో పాటు చెరువు కట్ట వెంబడి వాకర్స్ కూర్చోవడానికి అనువైన బెంచీలు, బతుకమ్మ ఘాట్ మెట్ల నిర్మాణం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రంగులు వేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా చెరువులో వ్యర్థాలతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. చెరువులోకి మురుగు నీరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ ఎం దుర్గా దీప్‌లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, డీఈఈ వెంకన్న, ఏఈఈ శ్రీనివాసులు, ఎఫ్‌ఆర్‌వో సుధీర్, అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.