calender_icon.png 19 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రమణీయం.. రామయ్య కల్యాణం

07-04-2025 01:11:30 AM

  1. కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
  2. తరలివచ్చిన భక్త జనం

మహబూబాబాద్, ఏప్రిల్ 6, (విజయ క్రాంతి): మానుకోట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తోర్రూరు, కేసముద్రం పట్టణాలతో పాటు 18 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సీతా రామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఉత్సవ విగ్రహాలకు అడుగడుగునా నీరాజనం పలికారు. అనంతరం దేవాలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. రామనామ జపం, జయ జయ ద్వానాలతో దేవాలయాలు హోరెత్తిపోయాయి.నవమి వేడుకలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు వడపప్పు, పానకం ప్రసాదంగా అందజేశారు.

 పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు 

కాటారం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) :  శ్రీరామనవమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. రాష్ట్ర ఐ టీ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తల్లి శ్రీమతి జయ శ్రీ , ఆయన సోదరుడు శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు.

వారి ఇంటి ఇలవేల్పు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దుద్దిళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగ గా జరిగింది. ఉదయం నుంచే పచ్చని పందిళ్లు, తోరణాలతో ఊరంతా పందిరి , సీతారాముల పెళ్లి ముస్తాబయింది. శీను బాబు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణాన్ని వారి చేతుల మీదుగా జరిపించారు.

వేద పండితులు మంత్రోచ్చరణాలు  గావించగా,  జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా, మేళా తాళాల మధ్య రాములోరి పెళ్లి జరిగింది.  మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్గీయ శ్రీపాద రావు సతీమణి శ్రీమతి జయశ్రీ పూజల్లో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీత రాముల వారి కళ్యాణం తలంబ్రాలను భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది.

జనగామలో..

జనగామ, ఏప్రిల్ 6(విజయక్రాంతి): జనగామ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల ప్రాంగణాల్లో సీతారాముల వివాహ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. జనగామలోని పాతబీటు బజార్‌లో ఏర్పాటు చేసిన వేడకలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతేగాకుండా జిల్లా కేంద్రంలోని అన్ని హనుమాన్ ఆలయాలతో పాటు శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఆలయ ప్రాంగణాలు భక్తజన రామనామ స్మరణతో మారుమోగాయి. మూలబావి సీతారాముల ఆలయంలో ప్రధానార్చకుడు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. పుష్పమాలాంకరణ, కన్యాదానం, సీతారాముల గోత్ర ప్రవరలు, అక్షితారోపన, అష్టోత్తర శతనామార్చన, మహా భోగము, మహా నీరాజనము, మహా మంత్ర పుష్పము, అద్భుతమైన రీతిలో వైదిక పూజా క్రతువులను నిర్వహించారు.

వైభవోపేతంగా..

భీమదేవర పల్లి, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ ,కొప్పూర్ ,గట్ల నర్సింగాపూర్ ఆలయాల్లో రాములోరి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముల్కనూర్ లో జరిగిన కళ్యాణ మహోత్సవ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సతీమణి అలిగిరెడ్డి రాజ్యలక్ష్మి, ఆలయ చైర్మన్ గన్ను శ్రీనివాస్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ ,వంగ రవీందర్, కోడూరి సరోజన ,

ఊస కోయిల ప్రకాష్ చంద్రకళ అప్పని పద్మ బిక్షపతి, మాడుగుల కొమురయ్య, బొల్లంపల్లి రమేష్ దారణ శ్రీనివాస్, డాక్టర్ ఎద్దులాపురం తిరుపతి, మాడుగుల గోపి, ఆలయ అర్చకులు మధుకర్ శర్మ ,దేవగిరి సునీల్ కొప్పూర్ రాములోరి కళ్యాణ మహోత్సవంలో ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి సభ్యులు గద్ద రాజమణి సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు గద్ద సంపత్, తోపాటు భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమకొండలో.. 

హనుమకొండ, ఏప్రిల్ 6 (విజయకాంతి):  శ్రీ రామ నవమి సందర్భంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల గుడి, రైల్వే టెంపుల్, రెవెన్యూ కాలనీ రామాలయం, హనుమాన్ నగర్ డబ్బాలు ఆంజనేయ స్వామి దేవాలయం లలో  నిమి వంశోద్ధవులు, మిథిలా నగరాధిపతి  జనక మహారాజు పుత్రి యగు ఛి.ల.సౌ సీతమాహలక్ష్మి  రఘు వంశోద్ధవులు, అయోధ్యా నగరాధిపతి  దశరథ మహారాజు జ్యేష్ట పుత్రుడు  ఛి. రామచంద్రమూర్తి  కళ్యాణ మహోత్సవంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని సీతారాములవారికి పట్టు వస్త్రాలు బహుకరించి, పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమన్, జక్కుల రజిత శ్రీనివాస్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, ఆలయ ప్రధాన అర్చకులు గంగుల ఉపేందర్ శర్మ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్, నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, పల్లె రాహుల్ రెడ్డి, భక్తులు  పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్ మండలంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస రెడ్డి. శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు.