ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్‌ఎస్ సైదులు హీరోగా, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘1980స్ రాధే కృష్ణ’. వూడుగు సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతుంది. ఒక అందమైన ప్రేమజంట కులాల కారణంగా వచ్చిన విభేదాలను ఎలా ఎదుర్కొని ఒక్కటయ్యారనేది సినిమా కథాంశం.